మునక్కాయ తింటే ఇన్ని ప్రయోజనాలా..?

Jyothi Gadda

25 January 2025

TV9 Telugu

మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అనేక వ్యాధులను తగ్గించే శక్తి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. 

TV9 Telugu

ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉంటాయి. మునక్కాయ రుచిలో ఎంతో కమ్మనిది. అంతేకాదు ఇందులో మేలు చేసే పోషకాలు ఎన్నో ఉంటాయి.

TV9 Telugu

శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడానికి మునక్కాయ ఎంతగానో దోహదపడుతుంది. మునగలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. 

TV9 Telugu

మునగ చెట్టు ఆకులు, కాయలని కూరలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

TV9 Telugu

మునక్కాడలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. మునగ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. 

TV9 Telugu

అధిక రక్తపోటు ఉన్న రోగులకు మునక్కాయ చాలా మేలు చేస్తుంది. మునగలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.

TV9 Telugu

మునగలో ఉండే పోషకాలు రక్తనాళాలలో చెడు కొలస్ట్రాల్‌ పేరుకుపోకుండా చేస్తాయి. దీన్ని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

TV9 Telugu

మునగ చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ వంటి పలు పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి. మొటిమలను తొలగిస్తుంది.

TV9 Telugu