కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా..తస్మాత్ జాగ్రత్త

TV9 Telugu

12 February  2024

ప్రస్తుతం కూల్‌ డ్రింక్స్‌ తీసుకోవటం అనేది ఫ్యాషన్‌గా మారింది. కానీ, కూల్‌ డ్రింక్స్‌ అధికంగా కెమికల్స్‌ను కలుపుతారు. దీని వల్ల కలిగే తీవ్రమైన వ్యాధులు తెలిస్తే మీరు మరోమారు ఈ డ్రింక్స్‌ ముట్టుకోరు. 

ఈ కెమికల్స్ వల్ల డయాబెటిస్‌, గుండె జబ్బులు, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. సాఫ్ట్‌ డ్రింక్‌ నుంచి డైట్‌ సోడా వరకు వీటిలో షుగర్‌ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

కూల్‌డ్రింక్స్‌ చాలా ప్ర‌మాద‌క‌రం. సాధార‌ణంగా 250 -300 మిల్లీ లీటర్ల కూల్ డ్రింక్​లో 150-200 క్యాల‌రీలు ఉంటాయి. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారిలో జీర్ణ వ్య‌వస్థ దెబ్బ‌తింటుంది.  

చాలా మంది డీహైడ్రేషన్‌ నుంచి తప్పించుకోవడానికి ఈ కూల్‌ డ్రింక్స్‌ను తాగుతారు. కానీ వీటి వల్ల మరింత డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి. ఇందోని కెఫిన్ వ‌ల్ల అధిక రక్త‌పోటు సమస్యకు దారి తీస్తుంది. 

అంతేకాకుండా కూల్‌ డ్రింక్స్‌ అతిగా తాగటం వల్ల ఎముకల బలహీనతకు దారితీస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

కూల్‌ డ్రింక్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మ‌తిమ‌రుపు వచ్చే అవకాశం ఉంది. కూల్​ డ్రింక్స్ అతిగా తాగే పురుషుల‌కు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం 20 శాతం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసే ఈ పదార్థాలు తీసుకోకపోవడం చాలా మంచిది. దీనికి బదులు పోషకాలు కలిగిన పదార్థాలు తీసుకోవడం చాలా మంచదని నిపుణులు చెబుతున్నారు. 

హానికరమైన ఈ కూల్‌ డ్రింక్స్‌ కన్నా ఆరోగ్యకరమైన జ్యూస్‌లు చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి.