ఈ సీజన్‌లో రాత్రి ఉప్పు కలిపిన నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

20 July 2024

TV9 Telugu

Pic credit - pexels

ఆరోగ్యంగా ఉండటానికి రోజుని ఆరోగ్యకరమైన అలవాట్లతో ప్రారంభించాలి. అదే విధంగా రోజుని ఆరోగ్యకరమైన రీతిలోనే ముగించాలి.

ఆరోగ్యకరమైన అలవాటు

ఉదయం నిద్ర లేవగానే వేడి నీళ్లలో ఉప్పు కలిపి తాగడం వల్ల కలిగే లాభాలు ఎన్నో తెలుసు.. అయితే నిద్రపోయే ముందు ఉప్పునీరు తాగితే ఏమవుతుందో ఈ రోజు తెలుసుకుందాం.. 

ఉప్పు నీరు

నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు , దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దీని కోసం మీరు గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి.

గొంతు సమస్యలకు ఉపశమనం

తరచుగా నోటి దుర్వాసనతో కొంతమంది ఇబ్బంది పడతారు. అటువంటి వ్యక్తులు ఉప్పు కలిపిన నీటిని సహజ మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు. ఈ నీటితో పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది.

దుర్వాసన నుండి ఉపశమనం

రోజూ నిద్రపోయే ముందు ఉప్పునీరు తాగితే.. అనేక సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

సీజనల్ వ్యాధుల నుండి రక్షణ

రోజూ రాత్రి పడుకునే ముందు ఉప్పు కలిపిన నీరు తాగడం వల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫం సులభంగా బయటకు వస్తుంది. ఈ ఉప్పు నీటికి నల్ల మిరియాల పొడిని కూడా జోడించవచ్చు.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం

మీరు రాత్రి పడుకునే ముందు ఉప్పునీరు తాగితే.. దీనికి రాతి ఉప్పు మాత్రమే ఉపయోగించండి. ఈ సీజన్ లో తెలుపు లేదా ఏదైనా ఇతర ఉప్పును ఉపయోగించడం కంటే రాతి ఉప్పు మంచిది. 

ఏ ఉప్పు వాడాలి

నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఉప్పు నీరు బెస్ట్ మెడిసిన్. ఈ నీరు శరీరంలో ఏర్పడే ప్రమాదకర ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. రాత్రి సుఖంగా నిద్రపోయెలా చేస్తుంది. 

నిద్రలేమి సమస్యకు చెక్