05 November 2024
TV9 Telugu
Pic credit - Getty
పాలను మరిగించకుండా తాగడం ప్రమాదం అని ఇలా చేయడం డేంజర అని.. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాలను మరిగించి తాగాలని వారు సూచిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆవు, గేదె లేదా మేక నుంచి తీసుకున్న పాశ్చరైజ్ చేయని పాలలో హానికరమైన జెర్మ్స్ లేదా బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి చాలా తీవ్రమైన వ్యాధులను కలిగిస్తాయి
పచ్చి పాలలో జెర్మ్స్ లేదా బ్యాక్టీరియా ఉండవచ్చు. వీటి కారణంగా కీళ్లనొప్పులు, డయేరియా లేదా డీహైడ్రేషన్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
పచ్చి పాలులో ఉండే లిస్టెరియా మోనోసైటోజెన్స్ బ్యాక్టీరియా గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. లిస్టిరియాసిస్ అనే ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఇది గర్భిణీ స్త్రీకి, నవజాత శిశువుకు ప్రమాదకరం.
పచ్చి పాలను తీసుకోవడం వల్ల గర్భస్రావం, నెలలు నిండకుండానే ప్రసవం లేదా బిడ్డ , తల్లి ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది.
పచ్చి పాలలో అనేక రకాల హానికరమైన బ్యాక్టీరియాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి HPAI A (H5N1) ఇది బర్డ్ ఫ్లూని కలిగిస్తుంది.
పచ్చి పాలల్లో వివిధ ఆమ్లాలు, ప్రోటీన్లు ఉంటాయి. పచ్చి పాలు తీసుకుంటే శరీరంలో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది.
పచ్చి పాలు తాగడం వలన కడుపు సంబంధిత వ్యాధులు లేదా సమస్యలు ఇబ్బంది పెడతాయి. కడుపు నొప్పి లేదా ఎసిడిటీ సమస్యల బారిన పడే అవకాశం ఉంది.