గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే.. వీరికి మాత్రం విషంతో సమానం 

24 August 2024

TV9 Telugu

Pic credit -  Pexels

గ్రీన్ టీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. కనుక గ్రీన్ టీని తాగడం వలన బరువు తగ్గడమే కాదు చర్మం కాంతి వంతంగా మారుతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, జుట్టు రాలడం నుండి ఉపశమనాన్ని అందించడంలో, మెదడుకు మేలు చేయడంలో, బీపీని నియంత్రించడంతో పాటు షుగర్ పేషెంట్స్ కు మేలు చేస్తుంది. 

గ్రీన్ టీ ప్రయోజనాలు

గ్రీన్ టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. గ్రీన్ టీని ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం 

ఎవరికీ హానికరం అంటే 

గ్రీన్ టీలో టానిన్ ఉంటుంది. కాబట్టి దీనిని అధికంగా తీసుకోవడం వల్ల అసిడిటీ, అజీర్ణం, కడుపు మంట మొదలైన జీర్ణ సమస్యలు వస్తాయి.

జీర్ణక్రియ సమస్యలుంటే 

కిడ్నీల్లో రాళ్ళ సమస్య ఉన్నవారు గ్రీన్ టీని తాగితే సమస్య మరింత ఎక్కువ అవుతుంది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కాల్షియం ఎక్కువగా మూత్రంలోకి చేరుతుంది. దీంతో రాళ్ళు ఏర్పడతాయి.

కిడ్నీల్లో రాళ్ళ సమస్య

గ్రీన్ టీలో ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటుంది. కనుక గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు, గుండెల్లో మంట వంటి సమస్యలు ఉన్నవారు దీనిని తాగకపోవడమే మంచిది 

గ్యాస్ట్రిక్ సమస్యలు

గ్రీన్ టీని ఎక్కువగా తాగడం వల్ల కాల్షియం శోషణకు ఆటంకం ఏర్పడుతుంది. దీని కారణంగా ఎముకలు బలహీనపడతాయి.

ఎముకలు బలహీనం

గ్రీన్ టీలో కెఫిన్ కూడా ఉంటుంది. కనుక దీనిని అధికంగా తీసుకుంటే విశ్రాంతి లేకపోవడం, నిద్ర భంగం, గుండె కొట్టుకోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు.

గ్రీన్ టీలో కెఫిన్

రోజుకు రెండు మూడు కప్పుల గ్రీన్ టీ తాగితే చాలు, ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలగదు.

రోజుకు ఎంత గ్రీన్ టీ