Juice 9

గ్లాస్‌ స్కిన్‌ కావాలా? అయితే ఈ 3 రకాల పండ్ల రసాలు తాగేయండి

08 October 2024

image

TV9 Telugu

అందంగా కనిపించడానికి అనేక రకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటాం.. కానీ పైపూతలే సరిపోవు. తినే ఆహారంపైనా శ్రద్ధ పెడితే చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది

TV9 Telugu

అందంగా కనిపించడానికి అనేక రకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటాం.. కానీ పైపూతలే సరిపోవు. తినే ఆహారంపైనా శ్రద్ధ పెడితే చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది

మచ్చల్లేని మెరిసే, మృదువైన చర్మం కావాలని ఎవరికుండదు?అందుకు లోపల్నుంచీ పోషణ కావాలి. ఇవి అందంతో పాటు ఆరోగ్యం కూడా అందిస్తాయి

TV9 Telugu

మచ్చల్లేని మెరిసే, మృదువైన చర్మం కావాలని ఎవరికుండదు?అందుకు లోపల్నుంచీ పోషణ కావాలి. ఇవి అందంతో పాటు ఆరోగ్యం కూడా అందిస్తాయి

ఈ కింది మూడు రకాల పండ్ల రసాలు మీ రోజు వారి ఆహారంలో తీసుకుంటే గ్లాస్‌ స్కిన్ సహజంగా మీ సొంతం చేసుకోవచ్చు. అవేంటో.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం

TV9 Telugu

ఈ కింది మూడు రకాల పండ్ల రసాలు మీ రోజు వారి ఆహారంలో తీసుకుంటే గ్లాస్‌ స్కిన్ సహజంగా మీ సొంతం చేసుకోవచ్చు. అవేంటో.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం

TV9 Telugu

యాపిల్స్‌లో ఫైబర్, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే యాపిల్స్ చర్మాన్ని తేమగా ఉంచడంలో, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో మేలు చేస్తాయి

TV9 Telugu

5-6 ఆపిల్ ముక్కలను మిక్సర్‌లో వేసి, అందులో కొద్దిగా ఐస్, కొద్దిగా ఉప్పు, పంచదార కలపాలి. కావాలంటే కొంచెం నీళ్లు కూడా కలుపుకోవచ్చు. వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్‌ చేసుకుంటే జ్యూస్‌ తయారైనట్లే

TV9 Telugu

క్యారెట్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్‌లో ఉండే కెరోటినాయిడ్స్ చర్మాన్ని పునరుజ్జీవింపజేయడంలో మేలు చేస్తాయి. క్యారెట్ ఫైబర్ బరువు నియంత్రణలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది

TV9 Telugu

క్యారెట్‌లో పొటాషియం, విటమిన్ బి6 ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్‌ను కడిగి పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసి, మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకుంటే సరి

TV9 Telugu

పొడి చర్మానికి మెరుపును పునరుద్ధరించడంలో నారింజ రసం పాత్ర ఎనలేనిది. విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న నారింజ శరీరాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది

TV9 Telugu

నారింజలో గింజలు తీసి మిక్సీలోవేసి కాసిన్ని నీళ్లు జోడించి జ్యూస్‌ చేసుకోవాలి. జ్యూస్‌ని స్టయినర్‌లో వడకట్టి, రుచికి సరిపడా ఉప్పు, పంచదార వేసుకుంటే సరి. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది