ఈ జ్యూస్ వారం రోజులు తాగితే చాలు సమస్యలు ఖతం బాయ్ బాయ్..
TV9 Telugu
20 July 2024
కొత్తిమీర, పుదీనా తరుచు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
పుదీనా కొత్తిమీర ప్రతిరోజూ తీసుకుంటే శరీరంలోని మలినాలు, వ్యర్థాలు బయటకు బాడీని డీటాక్సీ ఫై చేస్తాయి.
ప్రస్తుతం చాలా మంది బీపీ, షుగర్, అధిక బరువు, కీళ్ల నొప్పులు, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడుతున్నారు.
ఇలాంటి వారు పుదీనా, కొత్తిమీర కలిపిన జ్యూస్ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈ జ్యూస్‌కి ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తి మీర, పది తులసి ఆకులు తీసుకుని శుభ్రంగా కడజి చిన్నగా తరిగి.. మిక్సీ జార్‌లో వేయాలి.
ఓ గ్లాస్ నీటిని పోసి మెత్తగా అయ్యేంత వరకూ మిక్సీ పట్టాలి. ఇందులో నిమ్మరసం కలుపుకుని నేరుగా తాగవచ్చు.
అలా తాగలేని వాళ్లు మజ్జిగలో అయినా కలుపుకుని తాగవచ్చు. మిక్సీ పట్టిన పేస్టును వడకట్టి అందులో నిమ్మరసం కలిపి ఐస్ క్యూబ్స్ వేసుకుని కూడా తాగవచ్చు.
ఇలా ఉదయం టీ, కాఫీలకు బదులు ఈ జ్యూస్ తాగితే చెప్పలేనన్ని ప్రయోజనాలు. ఒక్క వారం ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి