డ్రైఫ్రూట్స్ ముఖ్యంగా బాదం తింటే శరీరంలో కొవ్వు పెరిగి లావవుతామని చాలా మంది భావిస్తారు. కానీ ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు
నిజానికి బాదం పప్పు తింటే బరువు పెరగకుండానే, శరీరానికి అవసరమైన విటమిన్ 'ఇ', మోనో అన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు, మంచి కొవ్వులు వృద్ధి చెందుతాయి
ముఖ్యంగా రోజూ బాదం తినే మహిళల్లో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 35 శాతం తక్కువని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి
బాదంలో క్యాలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉండడమే కాకుండా దీనిలో ఉండే విటమిన్ 'ఇ', పీచు పదార్ధం బరువు తగ్గించడంలో సహాయపడతాయి
బాదంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ కొవ్వులు శరీరంలో, పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలపై దాడి చేసి దాన్ని క్రమంగా తగ్గించేస్తాయి
నూనె లేకుండా వేయించిన బాదం పప్పైనా, నానబెట్టినవైనా, నేరుగా తిన్నా.. ఇలా ఎలాగైనా ఈ మూడు పద్ధతుల్లో మీకు నచ్చినట్లుగా తినొచ్చు అంటున్నారు నిపుణులు
బాదంలోని మెగ్నీషియం రక్తంలోని చక్కెరల్ని అదుపు చేస్తుంది. తద్వారా ఆహారం ఎక్కువగా తినాలన్న కోరిక తగ్గి, అధిక సమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది
శరీరంలోని చెడు కొవ్వుల్ని తగ్గించి, మంచి కొవ్వుల్ని పెంచే శక్తి బాదం పప్పుకి ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది