కొబ్బరి పిండితో రోటీ చేసి తింటే.. డబుల్ బెనిఫిట్స్..!
TV9 Telugu
29 May 2024
సాధారణంగా గోధుమ పిండితో రోటీలు చేసుకుని తింటాం. కొందరు జొన్నలు, రాగి పిండిని ఉపయోగిస్తున్నారు.
కానీ మీరు ఎప్పుడైనా కొబ్బరి పిండితో చేసిన రోటీలను రుచి చూశారా? మస్త్ గా ఉంటాయని.. ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.
గోధుమ పిండికి గ్లూటెన్ రహిత ప్రత్యామ్నాయం కొబ్బరి పిండి. కొబ్బరి పిండిలోని ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.
ఫైబర్ సరైన జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది.. మలబద్ధకం,తిమ్మిరి వంటి కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునేవారికి కూడా కొబ్బరి పిండి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో తక్కువ మొత్తంలో కేలరీలు, కొవ్వు ఉంటుంది.
కొబ్బరి పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది. అంటే అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. మధుమేహ రోగులకు ప్రయోజనకరం.
కొబ్బరి పిండిలో ఉండే లారిక్ యాసిడ్ , గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది.
దీంతో పాటు కొబ్బరిపిండితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనితో చేసిన వంటకాలు చాల రుచికరంగా, ఆరోగ్యకరంగానూ ఉంటాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి