రుద్రాక్షను ధరించినవారు ఈ నియమాలు తప్పక పాటించాలి!
02 August 2024
TV9 Telugu
TV9 Telugu
రుద్రాక్షలు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావిస్తుంటారు హిందువులు. జీవితంలో ఆనందం, శాంతి వనకూరాలంటే, గ్రహాలను శాంతింప చేయడానికి చాలా మంది రుద్రాక్షలను ధరిస్తారు
TV9 Telugu
రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. కానీ సరైన నియమాలు పాటించకుండా రుద్రాక్షను ధరిస్తే, మేలుకు బదులు కీడు సంభవిస్తుందని అంటుంటారు
TV9 Telugu
వీటిని ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయట. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు తొలగిపోతాయట
TV9 Telugu
అందుకే రుద్రాక్ష ధరించడానికి అనేక నియమాలు, నిబంధనలను ప్రాచీన గ్రంధాల్లో పేర్కొన్నారు. వీటి గురించి సరిగ్గా తెలుసుకుని, అప్పుడే రుద్రాక్షను ధరించాలి
TV9 Telugu
గ్రంధాల ప్రకారం రుద్రాక్షను శుద్ధి చేసి పవిత్రం చేసిన తర్వాత మాత్రమే పట్టుకోవాలి. రుద్రాక్షలో దాదాపు 21 రకాలున్నాయి. ఏక ముఖి రుద్రాక్ష చాలా అరుదైనది
TV9 Telugu
ఒకరి రుద్రాక్షను మరొకరు పట్టుకోకూడదు. రుద్రాక్షను ఎల్లప్పుడు బంగారం, వెండి, పట్టు లేదా పత్తి దారంతో కట్టాలి.చాలామంది ఒకటి కంటే ఎక్కువ రుద్రాక్షలను ధరిస్తుంటారు.అలాంటప్పుడు రుద్రాక్షలు ఒకదానికొకటి అంటుకోకుండా ముడి వేయాలి.
TV9 Telugu
రుద్రాక్ష ధరించిన వారు ఉల్లిపాయ, వెల్లుల్లి, మిరియాలు మొదలైన వాటిని తినకూడదు. ఈ నియమాన్ని ప్రతిరోజూ పాటించలేకపోయినా కనీసం ప్రతి సోమవారం అయినా పూర్తిగా శాఖాహారంగా ఉండాలి
TV9 Telugu
రుద్రాక్షను ధరించిన వారు ప్రతిరోజూ శివుడిని ధ్యానించడం మంచిది. ప్రతి సోమవారం ప్రదోష సమయంలో శివాలయాన్ని దర్శించి శివుని తలపై నీరు పోసి రుద్రాక్షను పట్టుకుంటే శుభ ఫలితాలను ఇస్తుందట