ఈ వింత టూర్ గురించి తెలుసా.?
TV9 Telugu
24 May 2024
ఒక క్రూయిజ్ కంపెనీ సందర్శకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బట్టలు లేకుండా క్రూయిజ్‌లో ప్రయాణించడానికి అనుమతించింది.
దానికి టికెట్ ధర ఎంతో తెలుసా..? ఈ క్రూయిజ్‌లో వెళ్లేందుకు ఒక వ్యక్తి ప్రారంభ ధరగా రూ.1.25 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ అరుదైన విహారయాత్రను నార్వేజియన్ పర్పుల్ క్రూజ్ నిర్వహించింది. 11 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో బట్టలు వేసుకోకుండా ఉండాల్సి ఉంటుంది.
నార్వేజియన్ పర్పుల్ క్రూజ్ తరచుగా ఇలాంటి పర్యటనల కోసం వార్తల్లో నిలుస్తుంది. ఈ సంస్థ ఫ్రీస్టైల్ క్రూజింగ్‌కు ప్రసిద్ధి చెందింది.
ఇందులో ప్రజలు బట్టలు లేకుండా కనిపిస్తారు. ఈసారి బట్టలు లేని ఈ ప్రయాణం 3 ఫిబ్రవరి 2025న ఫ్లోరిడాలోని మయామి నుండి ప్రారంభమవుతుంది.
ఈ క్రూయిజ్ ప్రయాణం 14 ఫిబ్రవరి 2025న ప్యూర్టో రికోలోని జువాన్‌లో ముగుస్తుంది. ఆసక్తి ఉన్నవారు వెంటనే బుక్ చేసుకోండి.
ఇందులో వెళ్లాలనుకుంటే ప్రయాణీకులందరూ తప్పనిసరిగా 21 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
అదే సమయంలో, బట్టలు లేకుండా కెప్టెన్, రిసెప్షన్, డైనింగ్ ఏరియాకు వెళ్లడానికి అనుమతించరు. మరికొన్ని రూల్ పాటించాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి