రాగి పాత్రల్లో వీటిని తీసుకుంటున్నారా.? 

26 November 2023

రాగి పాత్రల్లో నీటిని తాగితే శరీరానికి మేలు జరుగుతుందని తెలిసిందే. అయితే కొన్ని రకాల పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో రాగి పాత్రలో తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

రాగి పాత్రల్లో ఎట్టి పరిస్థితుల్లో పాలు లేదా పాల ఉత్పత్తులను నిల్వ ఉంచకూడదు. ఇలా చేయడం అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. 

ఇక ఊరగాయలను కూడా ఎట్టి పరిస్థితుల్లో రాగి పాత్రల్లో ఉంచకూడదు. ఇలా ఉంచిన ఊరగాయాలను తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

నిమ్మకాయ రసాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో రాగి పాత్రలో పోసి తీసుకోకూడదు. నిమ్మకాయలో సహజంగానే యాసిడ్ ఉంటుంది. ఇది రాగితే స్పందించడం వల్ల గ్యాస్‌, కడుపు నొప్పి వస్తుంది. 

రాగి పాత్రలో పెరుగును కూడా స్టోర్ చేయకూడదు. అలాగే రాగి ప్లేట్‌లో ఎట్టి పరిస్థితుల్లో పెరుగు కలిపిన అన్నాన్ని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. 

రాగి పాత్రలో ఉంచకూడని మరో పదార్థం జామ్‌. జామ్‌ను రాగి పాత్రల్లో స్టోర్ చేసి తీసుకుంటే వికారం, వాంతులు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. 

పరిశోధనల్లో తేలిన అంశాల ప్రకారం.. రాగి పాత్రల్లో పులుపు పదార్థాలను అస్సలు తీసుకోకూడదని చెబుతున్నారు. వీటివల్ల కడుపులో మంట వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.