04 July  2024

ఉదయం లేవగానే ఇవి తీసుకుంటున్నారా.? 

Narender.Vaitla

మనలో చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ కడుపుతో కాఫీ తాగకూడదు. ఇది శరీరంలో ఆమ్లాలను పెంచి ఇబ్బందులకు గురి చేస్తుంది.

ఇక ఉదయం లేవగానే ఎట్టి పరిస్థితుల్లో స్పైసీ ఫుడ్‌ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల జీర్ణ సంబధిత సమస్యలు వస్తాయి.

ఖాళీ కడుపుతో సిట్రస్‌ ఫ్రూట్స్‌ను తీసుకోకూడదు. వీటివల్ల కడుపులో ఆమ్లాలు పెరుగుతాయి. దీంతో కడుపులో ఇరిటేషన్‌ ఫీలింగ్ కలుగుతుంది.

ఖాళీ కడుపుతో చక్కెర కంటెంట్‌ ఎ్కువగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. వీటివల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువుతాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రాసెస్‌ చేసిన ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఇలాంటి ఫుడ్‌ను ఎప్పుడు తీసుకున్నా ఇబ్బందులు తప్పవు. మరీ ముఖ్యంగా ఉదయం తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

ఉదయాన్నే కొవ్వు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాలేయ సంబంధిత సమ్యలు తలెత్తుతాయి.

ఉదయాన్నే నిమ్మకాయ, తేనె తాగే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. అయితే ఇది మంచిదే అయినా అసిడిటీ సమస్యలతో బాధపడేవారికి ఇబ్బందిగా ఉంటుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.