ఈ మధ్యకాలంలో చాలా మంది ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌లో గ్యాస్, కడుపులో మంట, ఛాతిలో మంట, ఆసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్య నుంచి బయట పడేందుకు చాలా మంది కొన్ని రకాల తప్పులు చేస్తున్నారు. వాటి వల్ల సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం, చాలా వేగంగా భోజనం చేయడం, మోతాదుకు మించి తినడం, అధిక బరువు, పొగతాగే అలవాటు, మద్యం సేవించడం, ఒత్తిడి, కొన్ని రకాల మందులతో ఎసిడిటీ రావచ్చు.
కడుపులో లేదా గుండెల్లో మంట రాగానే చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. అరగడం కోసం నిమ్మ రసం తాగుతారు. నిజానికి కడుపులో మంట వచ్చినప్పుడు నిమ్మరసం తాగితే ఈ సమస్య మరింత పెరుగుతుంది.
నిమ్మరసంలోని ఆమ్లతత్వం అన్నవాహికను మరింత ఇబ్బంది పడుతుంది. దీంతో మంట ఇంకా ఎక్కువ అవుతుంది. కడుపులో, గుండెల్లో మంటగా అనిపించినప్పుడు చాలా మంది సోడా లేదా కూల్ డ్రింక్స్ వంటివి కూడా ఎక్కువగా తాగుతారు.
ఇలా తాగడం వల్ల మంట అనేది మరింత పెరుగుతుంది. ఒక్కోసారి ఇది తీవ్రతరమై ప్రాణాల మీదకు వస్తుంది. కాబట్టి కడుపులో, గుండెల్లో మంటగా ఉన్నప్పుడు సోడాలు, కూల్ డ్రింక్స్ తాగకపోవడం చాలా మంచిది.
ఆపిల్ సైడర్ వెనిగర్ తాగితే అసిడిటీ తగ్గుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆపిల్ సైడర్ తాగినా ఎలాంటి మార్పు ఉండదు. ఇంకా దీంతో సమస్య పెరుగుతుంది.