తొందరపడి ఈ తప్పు చేయకండి, లేదంటే రూ. 5000 ఫైన్

TV9 Telugu

30 December 2024

ట్రాఫిక్ రూల్ బ్రేకర్లు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పులు చేస్తే, ఇకపై మీకు భారీగా చలాన్ తప్పుదు.

మీరు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు. ఏ ట్రాఫిక్ రూల్‌ను ఉల్లంఘిస్తే, రూ. 5,000 చలాన్ వేస్తారో మీకు తెలుసా?

హడావుడిగా మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇంట్లో మరచిపోయి, పోలీసు తనిఖీ సమయంలో మిమ్మల్ని ఆపివేస్తే చలాన్ తప్పదు.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు మీకు రూ. 5000 చలాన్ తప్పదు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 3/181 కింద మీకు ట్రాఫిక్ చలాన్ జారీ చేయడం జరుగుతుంది.

డీఎల్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే మొదటి తప్పు అయినా, రెండో తప్పు అయినా రూ.5వేలు జరిమానా విధించడం ఖాయం.

మీకు ఎప్పుడైనా అలాంటి పరిస్థితి ఎదురైతే, మీకు చలాన్ తప్పాలంటే ఇలా చేసినట్లయితే ఎలాంటి చలాన్ మీకు పడదు.

డిజిలాకర్ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. డిఎల్, ఆర్‌సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్‌ను యాప్‌లో సేవ్ చేయండి.

డిజిలాకర్ యాప్‌ ద్వారా మీరు డిఎల్‌ను మర్చిపోయినా, మీరు యాప్‌లో ట్రాఫిక్ పోలీసులకు పత్రాలను చూపించవచ్చు.