08 October 2024
TV9 Telugu
Pic credit - Pexel
పాలు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎందుకంటే ఇందులో క్యాల్షియం సహా అనేక ఇతర పోషకాలు ఉన్నాయి.
ఢిల్లీలోని ఆయుర్వేదానికి చెందిన డాక్టర్ ఆర్పీ పరాశర్ చెప్పిన ప్రకారం పాలతో కలిపి తినకూడనివి కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం.
పుల్లని స్వభావం కలిగిన పండ్లు అంటే ఆమ్లత్వం అధికంగా ఉన్న పాలు కలిపి తీసుకుంటే గ్యాస్, గుండెల్లో మంట, జలుబు, దగ్గు, దద్దుర్లు, అలర్జీ వంటి సమస్యలకు కారణం కావచ్చు
అల్పాహారంగా ముల్లంగి పరాటాలు లేదా కూరగాయలు తింటుంటే అప్పుడు వెంటనే పాలు తాగకూడదు. ఇలా చేయడం వలన చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
అరటిపండు, పాలను కలిపి రకరకాలుగా తినడం సర్వసాధారణం. అయితే ఇలా తినడం అనారోగ్యానికి హానికరం. పిండి స్వభావం ఉండే అరటిపండు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పాలతో కలిపి తింటే పొట్ట ఉబ్బరంగా ఉంటుంది.
పుచ్చకాయ ముక్కలను పాలతో మిక్స్ చేసి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి కాంబినేషన్ జీర్ణక్రియ దెబ్బతినే అవకాశం ఉంది. కొందరికైతే వాంతులు వంటి ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.
పాలతో ఉప్పు పదార్థాలను తీసుకోవడం మానుకోవద్దు. రాత్రి భోజనం చేసిన వెంటనే పాలు తాగకూడదు.