నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం తీసుకునే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర వస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ ఆల్కహాల్ నిద్రను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో యాసిడ్ ప్రభావాన్ని పెంచుతుంది.
రాత్రుళ్లు ఎక్కువగా తిన్నా నిద్ర దూరమవుతుంది. ముఖ్యంగా కొవ్వు, చీజ్, ఫ్రై చేసిన ఫుడ్స్ అజీర్ణానికి దారితీస్తాయి. ఇవి రాత్రుళ్లు నిద్రపోకుండా చేస్తాయి.
నీటి కంటెంట్ ఎక్కువగా ఉండే వాటర్ మిలాన్ వాంటి వాటిని రాత్రుళ్లు తీసుకోకూడదు. దీనివల్ల బాత్రూమ్
కి ఎక్కువ లేవాల్సి వస్తుంది. ఇది మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.
రాత్రుళ్లు కాఫీ, టీలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల నిద్ర దూరమవుతుందని సూచిస్తున్నారు. రాత్రి పడుకునే 3గంటల ముందే ఇలాంటివి తీసుకోవాలి.
అలాగే స్వీట్స్, ఐస్ క్రీమ్
లు వంటివి తీసుకోకపోవడమే మంచిది. ఇలాంటి వాటి వల్ల రాత్రుళ్లు నిద్ర దూరమవుతుందని హెచ్చరిస్తున్నారు.
మసాలా వంటకాలు రాత్రిపూట తీసుకుంటే అవి గుండెల్లో మంటను పెంచుతాయి. అయితే ఇవి కేవలం గుండె సమస్యలనే కాకుండా నిద్రను కూడా బాగా ప్రభావితం చేస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.