31 December 2024
Pic credit -Pexels/Pixabay
TV9 Telugu
వాస్తవానికి నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే నెయ్యిని తినే విషయంలో తప్పులు చేస్తే అది ఆరోగ్యానికి హానిని కూడా కలిగిస్తుంది. నెయ్యితో తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి.
ముల్లంగి, నెయ్యి కలిపి తినకూడదు. నెయ్యి , ముల్లంగిని కలిపి తింటే కడుపు ఉబ్బరం , అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. కనుక పొరపాటున కూడా రెండింటినీ కలిపి తినవద్దు
ఆయుర్వేదం ప్రకారం తేనె, నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ కలయిక జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అనేక ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది.
చేపలు, నెయ్యి కలిపి తింటే జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఇవి శరీరంలో విషపూరిత మూలకాలను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాదు చర్మ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం పెరుగుతో నెయ్యి తినకూడదు. దీన్ని కలిపి తింటే ఎసిడిటీ సమస్యలు వస్తాయి. జీర్ణక్రియలో కూడా సమస్యలు ఏర్పడవచ్చు
నెయ్యి తిన్న వెంటనే వేడినీరు తాగడం వల్ల కడుపుకు అస్సలు మంచిది కాదు. ఇలా చేయడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
పండ్లు, ముఖ్యంగా సిట్రస్ పండ్లతో నెయ్యి కలపడం వల్ల విషపూరిత మూలకాలు ఉత్పత్తి అవుతాయి. కడుపు నొప్పి, అసిడిటీ, ఇతర జీర్ణ సమస్యలు కలుగుతాయి.