భోజనం చేస్తున్న సమయంలో నీళ్లు తాగడం సర్వసాధారణమైన విషయం. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని మీలో ఎంత మందికి తెలుసు.
అలాగే మనంలో చాలా మంది తిన్న వెంటనే ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీటిని తాగుతుంటారు. ఇది కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
తిన్నవెంటనే నీళ్లు తాగితే.. జీర్ణరసాలు పలుచబడిపోతాయి. ఇది అజీర్ణం, ఆకలి, పొట్ట నిండుగా అనిపించడం వంటి సమస్యలకు దారి తీస్తాయి.
తినగానే నీళ్లు తాగడం వల్ల ఎసిడిటీ పెరిగి ఛాతీలో నొప్పి వస్తుంది. కాబట్టి తిన్నవెంటనే నీటిని తాగకూడదు.
వెంటనే నీఉ తాగితే శరీరానికి పోషకాలు సరిగా లభించవు. తిన్నది శరీరాని ఒంటి బట్టకపోవడమం అంటే ఇదే. కాబట్టి తిన్నాక కాసేపయ్యకే నీటిని తాగాలి.
శరీర ఉష్ణోగ్రతపై కూడా నీరు ప్రభావం చూపుతుంది. తినగానే నీటిని తాగితే.. కొవ్వు పేరుకునేందుకు, ఇన్సులిన్ సమతౌల్యం దెబ్బతినేందుకు కారణమవుతాయి.
తినగానే నీరు తాగితే ఆహారం సరిగా జీర్ణం కాదు దీంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణంగా మారుతుంది. దీర్ఘకాలంలో ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.