గీజర్‌ వాడే సమయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? 

13 January 2024

TV9 Telugu

ఒకప్పుడు కేవలం కొందరి ఇళ్లకే పరిమితమైన గీజర్‌ ఇప్పుడు దాదాపు అందరి ఇళ్లలో దర్శనమిస్తోంది. తక్కువ ధరకే గీజర్‌లు అందుబాటులోకి రావడం ఇందుకు ఓ కారణంగా చెప్పొచ్చు. 

అయితే వాటర్‌ గీజర్‌ను ఉపయోగించే సమయంలో కొన్ని తప్పులు చేస్తే గీజర్‌ పేలిపోయే ప్రమాదం ఉంటుందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. 

మనలో కొందరు నీరు వేడెక్కిన తర్వాత కూడా గీజర్‌ను అలాగే ఆన్‌లోనే పెడుతారు. అయితే ఇలా చేయడం వల్ల గీజర్‌ పేలే ప్రమాదం ఉంటుంది.

గంటల తరబడి ఆన్‌లోనే ఉంచితే.. దాని ఒత్తిడి బాయిలర్‌పై పడుతుంది. ఇది గీజర్‌లో లీకేజీ సమస్యకు కారణమవుతుంది.

ఇక గీజర్లలో ఆటోమేటిక్ హీట్ సెన్సార్లు ఉన్నాయి. ఒకవేళ ఈ సెన్సార్లు పనిచేయడం మానేస్తే గీజర్ పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గీజర్‌ నుంచి వస్తున్న నీరు షాక్‌ వస్తున్నా, ట్యాప్‌లు షాక్‌ కొడుతున్నా వెంటనే ఎలక్ట్రిషియన్‌కు చూపించుకోవాలి.

మంచి వెంటిలేషన్‌ ఉన్న ప్రదేశంలోనే వాటర్‌ గీజర్‌లను ఏర్పాటు చేసుకోవాలి. గీజర్‌పై ఎలాంటి బరువైన వస్తువును ఉంచవద్దు. 

గీజర్ కు ఉపయోగించే వైర్ కచ్చితంగా నాణ్యమైందే అయి ఉండాలి. షార్ట్ సర్క్యూట్స్ జరిగే ప్రమాదం ఉన్న నేపథ్మంలో మంచి బ్రాండెండ్ వైర్ ను ఉపయోగించాలి.