10 August 2023
పూర్తిగా ఆత్మ విశ్వాసంతో ఉండాలి, ఎలాంటి ఇతర ఆలోచనలు రానివ్వకూడదు, ప్రశాంతంగా ఉండాలి. వేరే ఆలోచనలు రానివ్వకూడదు.
సరిగ్గా పర్ఫార్మ్ చేస్తామా లేదా అన్న సందేహం పెట్టుకోవద్దు, పూర్తి నమ్మకంతో, సానుకూల దృక్ఫథంతో మంచి ఆలోచనలు కలిగి ఉండాలి.
భాగస్వామి ఏమనుకుంటారో అన్న ఆలోచన వద్దు. మీ గురించి ఏమనుకుంటున్నారన్న ఆలోచన వద్దు. నిర్భయంగా వారితో మీ ఆలోచనలు పంచుకోండి.
గతంలో జరిగిన నెగిటివ్ అంశాలకు స్థానం ఇవ్వకండి. ఇది మీ శృంగారంపై ప్రభావం చూపుతుంది. మనసును పాడు చేసే ఆంశాల గురించి చర్చించవద్దు.
మీ ఇద్దరి బంధాన్ని బలపరిచే మాటలు తప్ప మరే ఇతర అంశాలు ప్రస్తావనకు తీసుకురాకండి. ఎదుటి వ్యక్తి మనుసును గాయ పరిచే మాటలకు దూరంగా ఉండండి.
శృంగారం విషయంలో మీ భాగస్వామి ఇష్టాలకు విలువ ఇవ్వండి. మీకు నచ్చింది చేయాలన్న మొండితనం వద్దు. భాగస్వామి మాటను గౌరవించడం అలవాటు చేసుకోండి.
శృంగార సమయంలో ఇతర ఆలోచనలు చేస్తే అంగస్తంభం జరగదు, శృంగారంలో సరిగ్గా పాల్గొనలేరు. ఇది మీ భాగస్వామిని కూడా ఇబ్బందికి గురి చేస్తుంది.
అకాల స్కలనం వంటి సమస్యలు వస్తాయి, శృంగారంపై కోరికలు తగ్గుముఖం పడతాయి. జీవితం మెకానికల్ గా మారుతుంది. శృంగారం గురించి ఓపెన్ గా మాట్లాడుకోవాలి.