పురుషుల్లో ఆ సమస్యకు ఇలా చెక్‌.. 

18 December 2023

సంతానలేమి సమస్య అంటే కేవలం మహిళల్లో కనిపించే సమస్యగానే భావించేవారు. కానీ ఇప్పుడు పురుషుల్లోనూ ఈ సమస్య ఎక్కువవుతోంది. 

మారుతోన్న జీవన విధానం, ఆహారంలో మార్పుల కారణంగా శుక్ర కణాల సంఖ్య తగ్గిపోతోంది. ఇది దీర్ఘకాలంగా మగవారిలో సంతానలేమికి కారణంగా మారుతోంది. 

శుక్ర కణాల సంఖ్య మెరుగ్గా ఉండాలంటే సింగరెట్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్లలోని నికోటిన్‌ వీర్యకణాల చలనాన్ని తగ్గిస్తుంది. 

 అధిక బరువు ఉన్న వారిలోనూ వీర్యకణాలపై ప్రభావం పడుతుంది. అధిక బరువుతో బాధపడేవారిలో వీర్య కణాల నాణ్యత తక్కువగా ఉంటుంది. 

ఎక్కువ కాలం ల్యాప్‌టాప్‌లను కాళ్లపై పెట్టుకొని పనిచేసే వారిలోనూ వీర్య కణాల నాణ్యత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

చిరుతిళ్లు, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ తీసుకునే వాళ్లలో వీర్యకణాల నాణ్యత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. 

వీర్య కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా 8 గంట నిద్ర ఉండాలి. నిద్రలేమీ కారణంగా వీర్యకణాల చలన శీలత, నాణ్యత తగ్గుతుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.