ముఖానికి ఈ 5 పదార్థాలు అప్లై చేశారో ఇంకా అంతే సంగతులు
TV9 Telugu
12 June 2024
అందంగా కనిపించాలంటే, మన చర్మం హెల్తీగా ఉండాలి. అందమైన, ఆరోగ్యకరమైన చర్మంతో మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది.
గ్లోయింగ్ స్కిన్ కోసం అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటాం. వీటిని వాడకుండా ఉండటమే మంచింది.. ముఖ్యంగా ఐదు పదార్థాలను ముఖానికి ఎప్పుడూ అప్లై చేయకూడదు. ఇవి తీవ్రమైన స్కిన్‌కేర్ ప్రాబ్లమ్స్‌కి దారితీస్తాయి.
వేడి నీరు: వేడిగా ఉండే నీటితో ముఖం కడిగితే చర్మానికి హాని కలుగుతుంది. ముఖం సహజ నూనెలను కోల్పోతుంది. దీంతో చర్మం పొడిగా మారి మొటిమలు, చర్మ వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుంది.
టూత్‌పేస్ట్: టూత్‌పేస్ట్‌లో చర్మానికి హాని చేసే రసాయనాలు ఉంటాయి. దీనివల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్ రావచ్చు. టూత్‌పేస్ట్‌లోని కెమికల్స్ చర్మానికి చికాకు కలిగించి, ఇన్‌ఫ్లమేషన్, రెడ్‌నెస్‌కు దారితీస్తాయి.
హెయిర్ ప్రొడక్ట్స్: హెయిర్ ప్రొడక్ట్స్‌లోని కెమికల్స్ ముఖంపై దద్దుర్లు, రెడ్‌నెస్, దురద వంటి సమస్యలు కూడా కలిగిస్తాయి. ముఖంపై ముఖం వాపు, కళ్లు వాపు వంటి సమస్యలు, అలర్జీలు కూడా రావచ్చు.
నూనెలు: కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వంటి వంట నూనెలను ముఖంపై నేరుగా రాసుకోకూడదు. కొన్ని చర్మ రకాలకు ఇవి పడవు. చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేసి మొటిమలకు దారితీస్తాయి.
బాడీ లోషన్: ముఖానికి బాడీ లోషన్ వాడే అలవాటు ఉంటే, దాన్ని వెంటనే మానేయండి.ఈ ప్రొడక్ట్స్‌లో సున్నితమైన ముఖ చర్మానికి అవసరమైన దానికంటే భారీ పదార్థాలు, సువాసనలు ఉంటాయి.