ఇలా చెయ్యండి చాలు.. మొండి మరకలన్నీ మాయం..
01 July 2025
Prudvi Battula
లిప్ స్టిక్ మరకలను తొలగించడానికి బ్రెడ్ ను తీసుకుని చుట్టూ కత్తిరించి మధ్య భాగం మరక ఉన్న ప్లేస్ లో కొంచెం సేపు రుద్ది సాధారణంగా ఉతకండి.
దుస్తులపై ఇంకు మరకలు మరక పడిన ప్లేస్ లో ఒక టీస్పూన్ హ్యాండ్ శానిటైజర్‌ని చల్లి కొంచెం సేపు అలా వదిలి వేయండి.. తర్వాత మామూలుగా ఉతకాలి.
హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ఒక టీస్పూన్ వాషింగ్ పౌడర్‌తో కలిపి.. తడిగా ఉన్నప్పుడే రక్తపు మరకలపై అప్లై చేయండి. 10 నిమిషాలు తర్వాత ఉతకాలి.
గ్రీజు, ఆయిల్ వంటి మరకలు దుస్తులపై ఉంటే.. ఆ ప్రదేశంలో సుద్ద ముక్కలతో లేదా టాల్కమ్ పౌడర్ తో రుద్ది నార్మల్ గా ఉతకండి.
మూడు ఆస్పిరిన్ మాత్రలను పొడి చేసి అర కప్పు వేడి నీటిలో కలపి చెమట మరకలున్న దుస్తులను మూడు గంటలు నానబెటట్టి ఆ తర్వాత ఉతకండి.
రెడ్ వైన్ మారక తడిగా ఉన్న సమయంలోనే పాలు, క్లబ్ సోడా, టేబుల్ సాల్ట్ సమాన మొత్తంలో తీసుకుని ఈ మిశ్రమం రెడ్ వైన్ మరకలపై అప్లై చేయాలి.
బట్టలపై పెయింటింగ్ రంగులు పడితే.. కొద్దిగా ఆల్కహాల్ ను ఆ మారకాలపై పదినిమిషాలు రుద్ది.. తర్వాత ఉతకాలి.
చెమట, దుర్వాసనతో ఉన్న బట్టలకు ఆ వాసన పోవాలంటే.. ఒక బకెట్ నీటిలో వెనిగర్ కలిపి బట్టలను ఉతికితే చెడు వాసన తొలగిపోతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
విమానంలో ఏ సీటు సురక్షితమైనదో మీకు తెలుసా?
అంతరిక్షంలో అత్యధిక సాటిలైట్లను కలిగిన దేశాలు ఇవే..
పురాణాల ప్రకారం.. అష్టదిక్పాలకులు ఎవరు.?