ఫ్రిజ్‌ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయడం 

8 October 2023

కొన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దుర్వాసన వస్తుంది. అలాంటివాటిని దూరంగా పెట్టడం చాలా అవసరం.

ఫ్రిజ్‌ దుర్వాసన..

కొన్ని గృహోపకరణాలను ఉపయోగించి దుర్వాసనలను తొలగించవచ్చు. అవేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇందులో కొన్ని మనకు తెలిసినవే..

ఫ్రిజ్‌ దుర్వాసన..

మీ ఫ్రిజ్‌ను తరచుగా శుభ్రం చేయడం ముఖ్యం. అనవసరమైన పదార్ధాలను మాత్రమే అందులో ఉంచాలి. అవసరం లేనివాటిని అందులో నుంచి తీసిపారేయాలి.

శుభ్రంగా ఉంచండి

ఫ్రిజ్ వాసన వచ్చిన తర్వాత ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అందులో నుంచి అన్నింటి బయట పారేస్తారు. అయినప్పటికీ ఆ వాసన పోదు. ఇలాంటి సమయంలో కాఫీ పొడిని ఫ్రిజ్‌లో వేస్తే వాసన పోతుంది.

కాఫీ పొడితో..

బేకింగ్ సోడా కూడా ఫ్రిజ్ నుంచి దుర్వాసనను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఫ్రిజ్‌లోని ఘాటు వాసనలను ఇది దూరం చేస్తుంది.

వంట సోడాతో..

ఫ్రిజ్ నుంచి దుర్వాసనను తొలగించడానికి మరో చిట్కా కూడా ఉంది. దీని కోసం ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించవచ్చు. దీనిని ఓ చిన్న కప్పులో పెట్టి ఫ్రిజ్ లో పెట్టండి చాలు. వాసనలు రావు.

ఆపిల్ సైడర్ వెనిగర్

కట్ చేసిన నిమ్మకాయలో లవంగాన్ని గుచ్చి ఫ్రిజ్ నాలుగు మూలల్లో పెడితే వాసన పోతుంది. ఇందు కోసం ముందుగా ఓ నిమ్మకాయ  తీసుకుని..దానిని మధ్యలోకి కట్ చేసి.. దానిపై లవంగం గుచ్చండి.

నిమ్మకాయతో..