రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి?

March 11, 2024

TV9 Telugu

ఒక్కోసారి రాత్రి పూట కుక్కలు గట్టిగా ఏడుస్తున్నట్లు అరుస్తాయి.. ఇలా అరిస్తే అపశకునంగా భావించాలా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది

నిజానికి, కుక్కలు అరవడం చాలా కామన్. ఇంటికి కొత్త మనుషులు వచ్చిన, ఏదైనా వింత శబ్ధాలు వినిపించినా, వేరే జంతువులు కనిపించినా అవి అరుస్తుంటాయి

చాలా సార్లు కుక్కలు అర్థరాత్రులు చాలా విచిత్రంగా ఏడుస్తున్నట్లు మొరుగుతాయి. దీంతో చాలా మంది అపశకునంగా కూడా ఫీల్ అయి వాటిని వారిస్తారు

దెయ్యాలు కనిపించినప్పుడు కుక్కలు ఆ విధంగా అరుస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే.. కుక్కలకు నిజంగానే దెయ్యాలు వంటి అదృశ్య శక్తులు కనిపిస్తాయా అంటే.. కాదని చెప్పాలి

ఎందుకంటే కుక్కలకు విశ్వాసంతోపాటు భయం కూడా చాలా ఎక్కువట. అందుకే ఏ కొంచం శబ్దం వినిపించిన వాటికి భయం వేసి అరవటం మొదలు పెడతాయి

దీంతో ఒకటి అరవగానే మిగతావి కూడా జాయిన్‌ అయ్యి కోరస్ ఇస్తాయి. మనుషుల్లా వాటికి మాటలు రావు కాబట్టి భయాన్ని ఆ వెల్లడిస్తాయని పెట్ డాక్టర్స్ చెబుతున్నారు

అలాగే పెంపుడు కుక్కలు కొన్ని సార్లు మనల్ని చూసి ఏడుస్తాయి. అలా చేయడం ద్వారా మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయట. కుక్కులు ఆ విధంగా మూలుగుతూ అరిచినప్పుడు ఏమైంది అనుకుంటూ మనం వాటిని అక్కున చేర్చుకుంటాం

ఇలా భయంగా అనిపించినా, రాత్రిపూట ఒంటరిగా అనిపించినా, తమ సహచరుల్లో ఎవరైనా కనబడకపోయినా అవి ఆ బాధతో అలా ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటాయట