మీకు తెలుసా? ఉప్పుకూ ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుందట.. ఎలా గుర్తించాలంటే

12 August 2024

TV9 Telugu

TV9 Telugu

ఉప్పు లేని వంటింటిని మనం అస్సలు ఊహించలేం. ఎందుకంటే ఉప్పులేనిదే ఏ వంట పూర్తి కాదు. స్వీట్స్‌ మినహాయిస్తే మిగతా ఏఉ వంటకమైనా ఉప్పు వేయకపోతే నోట్లో కూడా పెట్టలేం

TV9 Telugu

చవగ్గానే దొరుకుతుంది కదా, మరికాస్త వేసుకుంటే ఏమవుతుందిలే అనుకుంటే ఆరోగ్యానికి అదే పెద్ద ముప్పు అవుతుంది. మొత్తానికి ‘చిటికెడు ఉప్పు’ కూరలకు కమ్మని రుచిని తేస్తుందన్నమాట

TV9 Telugu

ఉప్పు లేకుండా వంట అసంపూర్ణంగా ఉంటుంది. సలాడ్‌లు లేదా వివిధ పండ్లతో కూడా ఏదైనా వంటలో ఉప్పు అవసరం. అయితే మీకు తెలుసా.. మిగతా అన్ని ఆహారాలకు ఉన్నట్లే ఉప్పుకు కూడా ఎక్స్‌పైరీ డేట్ (గడువు తేదీ) ఉంటుందట

TV9 Telugu

చాలా ఇళ్లలో ఉప్పు చాలా కాలం పాటు నిల్వ చేసుకుంటూ ఉంటారు. అయితే ఉప్పు ఎక్కువ కాలం నిల్వ చేసుకోకూదట. అన్ని ఆహారాలకు నిర్దిష్ట గడువు తేదీలు ఉన్నట్లే ఉప్పుకీ ఉంటుంది 

TV9 Telugu

గడువు ముగిసిన ఉప్పు ఆరోగ్యానికి హానికరం. ఉప్పు గడువు తీరిపోయిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

TV9 Telugu

ఉప్పు రంగు మారినా, తెల్లటి ఉప్పులో ఎర్రటి మచ్చలు అగుపించినా.. ఆ ఉప్పు చెడిపోయిందని అర్థం చేసుకోవాలి. అలాగే కొన్నిసార్లు నోట్లో ఉప్పు వేసుకుంటే లవణం కాకుండా చేదుగా అనిపిస్తుంది

TV9 Telugu

ఇలావుంటే కూడా ఉప్పు గడువు తీరిపోయిందని అర్థం చేసుకోవాలి. వాతావరణంలో తేమ కారణంగా ఒక్కోసారి ఉప్పు తడిసి పోతుంది. ఎండలో ఉంచిన తర్వాత కూడా ఆరకుండా ఉంటే, అది గడువు ముగిసినట్లు పరిగణించాలి. దానిని ఉపయోగించకూడదు

TV9 Telugu

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఉప్పు బయట ఉంచితే తేలికగా తడిసిపోతుంది. ఇది ఇంటి లోపల పొడి వాతావరణంలో ఉంచితే ఉప్పు తాజాగా ఉంటుంది