29 January 2024
TV9 Telugu
బంగాళదుంపలు ఇతర కూరగాయల కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. శరీరంలో కొవ్వును పెంచుతాయి. కనుక రోజూ బంగాళాదుంపలను తినవద్దు. ఊబకాయం పెరగవచ్చు
బంగాళాదుంపలను చిప్స్ రూపంలో లేదా ఏదైనా ఫాస్ట్ ఫుడ్ రూపంలో ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదకరం. ఊబకాయం వేగంగా పెరుగుతుంది.
డయాబెటిక్ రోగులకు బంగాళాదుంప ప్రమాదకరం. బంగాళదుంపలు తినడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అయితే అప్పుడప్పుడు తినవచ్చు.
డయాబెటిక్ పేషంట్స్ షుగర్ అదుపులో ఉంటే వారానికి ఒకటి లేదా రెండు సార్లు బంగాళదుంపలు తినవచ్చని డాక్టర్ పరమ్‌జిత్ కౌర్ అంటున్నారు. ఉడికించిన బంగాళదుంపలు తినండి.
బంగాళదుంపల్లో అధిక మొత్తంలో స్టార్చ్ ఉందని.. ఇది మీ జీవక్రియను పెంచుతుందని డాక్టర్ పరమ్‌జిత్ కౌర్ చెప్పారు. స్టార్చ్ కూడా చక్కెర స్థాయిని పెంచుతుంది.
తరచుగా అసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడితే.. లేదా శరీరంలో చక్కెర స్థాయి పెరిగితే, బంగాళాదుంపలకు దూరంగా ఉండండి.
బంగాళాదుంపలను పరిమితంగా అంటే వారానికి రెండు రోజులు తింటే ఎలాంటి హాని జరగదని డాక్టర్ కౌర్ చెబుతున్నారు.