పోషకాలు సమృద్ధిగా కలిగి చౌకగా దొరికే ఆహారం.. కోడిగుడ్డు. అన్ని కాలాల్లోనూ దొరికే, అన్ని వయసుల వారికీ నచ్చే ఆరోగ్యకరమైన ఆహార పదార్థం ఇది
TV9 Telugu
అందుకే కోడి గుడ్డును అన్ని వయసుల వారు ఇష్టంగా తింటుంటారు. ఆరోగ్య నిపుణులు కూడా రోజుకు ఒకటి నుంచి రెండు గుడ్లు తినడం మంచిదని చెబుతుంటారు
TV9 Telugu
కానీ మీకు తెలుసా గుడ్లు ఎక్కువగా తింటే మధుమేహం బారినపడే ప్రమాదం ఉందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఎవరైతే రోజుకు ఒకటి అంతకంటే ఎక్కువ గుడ్లు తింటారో వానిరి మధుమేహం రిస్క్ ఎక్కువట
TV9 Telugu
పైగా పురుషుల్లో కంటే మహిళల్లో ఈ రిస్క్ మరింత ఎక్కువని తేలింది. అతిగా గుడ్లను ఆహారంగా తీసుకోవడంతో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నేతృత్వంలో చైనా మెడికల్ యూనివర్సిటీ, ఖతార్ యూనివర్సిటీ కలిసి18 ఏళ్లు అధ్యయనం చేశాయి
TV9 Telugu
ప్రాసెస్డ్ ఫుడ్స్‌తోపాటు అతిగా గుడ్లను వినియోగించడం కూడా టైప్-2 మధుమేహుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నదని వారి 18 ఏండ్ల పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు వెల్లడించారు
TV9 Telugu
ఈ 18 ఏండ్ల కాలంలో చైనాలో గుడ్ల వినియోగం రెట్టింపైందని, తరచూ గుడ్లను ఆహారంగా తీసుకునే వారిలో మధుమేహం రిస్క్ పెరుగుతున్నట్లు, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది
TV9 Telugu
రోజూ 50 గ్రాముల కంటే తక్కువగా గుడ్లను ఆహారంగా తీసుకునే వారిలో 25 శాతం, రోజూ 50 గ్రాముల కంటే ఎక్కువ గడ్లు తినేవారిలో 60 శాతం మధుమేహం రిస్క్ పెరుగుతుందని వీరు నిర్ధారించారు
TV9 Telugu
మధుమేహం వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే గుడ్లను ఉడకబెట్టుకుని మాత్రమే తినాలని, గుడ్లతో చేసుకునే డిష్‌లలో నెయ్యి, నూనె, చీజ్ లాంటివి వాడకూడదని హెచ్చరించారు