మద్యం తాగాక కాఫీ తాగితే మత్తు తగ్గుతుందా?

April 14, 2024

TV9 Telugu

చాలామందికి కాఫీ అంటే మహా ఇష్టం. ఇంకొంతమంది మాత్రం కాఫీని వ్యసనంగా పరిగణించి దూరం పెడుతుంటారు. కానీ, మనకు వ్యసనం అనగానే మద్యం, సిగరెట్లు, డ్రగ్స్‌ వంటివి గుర్తుకువస్తాయి

నిజానికి కాఫీ విషయంలో మాత్రం వ్యసనం అనేది పెద్ద అంశంగా భావించరు. కెఫీన్‌ వినియోగం వల్ల తలెత్తే శారీరక, సామాజిక సమస్యలను అంతగా పట్టించుకోవల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు

 మోతాదు మించనంత వరకూ కాఫీ వ్యసనం కానేకాదు. అయితే, స్టిమ్యులెంట్స్‌తో పోలిస్తే ఫీల్‌గుడ్‌ హార్మోన్‌ డోపమైన్‌ స్థాయులు కాఫీతో నెమ్మదిగా పెరుగుతాయి

కాఫీకి అలవాటుపడిన వారు దానిని మానేసే క్రమంలో మగత, తలనొప్పి సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఉన్నపళంగా కాఫీ మానేయడానికి బదులు తాగే పరిమాణం తగ్గిస్తూ ప్రయత్నిస్తే కొన్ని రోజుల్లో ఈ అలవాటు నుంచి బయటపడతాం

అయితే మద్యం తాగిన తర్వాత దాని తాలూకు మత్తు నుంచి బయటపడాలంటే కప్పు కాఫీ తాగితే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. అయితే ఇందులో నిజమెంతో తెలుసుకుందాం

మద్యం తీసుకుని కాఫీ తాగితే వాహనాలు నడపేయవచ్చని అర్థం కాదు. ఆల్కహాల్‌ ప్రభావాన్ని కెఫీన్‌ ఏ మాత్రం తగ్గించలేదని పరిశోధనల్లో తేలింది. సాధారణంగా కెఫీన్‌ ఉత్తేజాన్ని ఇస్తుందనేది నిజం

అయితే మద్యం తాగినవాళ్లకు ఈ చిట్కా పనిచేయదు. ఇకపోతే మద్యం తాగినవాళ్లు కాఫీ తాగితే నిద్రమత్తు వదిలిపోతుంది. కాబట్టి మళ్లీ మద్యం మీదికి మనసు మళ్లేందుకు ఆస్కారం ఉంది

 అలాగే కాఫీ ఎక్కువగా తాగితే మూత్ర విసర్జన ఎక్కువవుతుంది. కాకపోతే రోజుకు ఓ నాలుగు కప్పుల కాఫీ అంత ప్రమాదకరం ఏమీకాదు. మూత్రం పసుపు రంగులో వస్తుంటే మాత్రం నీళ్లు ఎక్కువగా తాగాలి