మిరియాలు తింటే ఒంట్లో కొలెస్ట్రాల్‌  కరుగుతుందా?

25 July 2024

TV9 Telugu

TV9 Telugu

ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ హృదయ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది

TV9 Telugu

కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. కూరగాయలు, ధాన్యాలు ఎక్కువగా తినాలి. వీటితోపాటు మిరియాలు కూడా తీసుకోవాలి

TV9 Telugu

మిరియాలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. ఫలితాంగా హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్, విటమిన్ సి స్థాయిలు కూడా పెరుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

మిరియాలలో పైపెరిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది

TV9 Telugu

మిరియాలలోని పైపెరిన్ సమ్మేళనం LDL లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది

TV9 Telugu

మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇది కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

TV9 Telugu

మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. జీవక్రియను పెంచుతాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి

TV9 Telugu

కాబట్టి ప్రతి రోజూ రెండు మూడు మిరియాలు తినడం అలవాటు చేసుకోవాలి. విడిగా తినలేకపోతే ఆహారంలో మిరియాల పొడిని కలుపుకుని కూడా తినవచ్చు