ప్రసవం తర్వాత జుట్టు రాలుతోందా?

January 08, 2024

TV9 Telugu

కొంతమంది మహిళలకు ప్రసవం అయినప్పటి నుంచి జుట్టు ఎక్కువగా రాలడం ప్రారంభమవుతుంది. దీంత తల్లులు విపరీతంగా కంగారు పడుతుంటారు

నిజానికి గర్భం ధరించిన తర్వాత మహిళల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో.. అలాగే ప్రసవానంతరం కూడా కొన్ని మార్పులు రావడం సహజం

ప్రసవం తర్వాత జుట్టు రాలిపోవడం, కాళ్లలో వాపు వంటి పలు శారీరక మార్పులు సహజమేనని, పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు

సాధారణంగా గర్భంతో ఉన్న సమయంలో హార్మోన్లు, ఇతర కారణాల వల్ల జుట్టు కాస్త ఒత్తుగా పెరుగుతుంది. కానీ డెలివరీ తర్వాత జుట్టు రాలడం ఎక్కువగా గమనించచ్చు

ఇందుకు కూడా హార్మోన్లలో మార్పులు, మానసిక ఒత్తిడి సమస్యలే కారణమట. బాలింతల్లో కనీసం సంవత్సరం వరకు ఇలానే జరుగుతుంటుంది

అయితే ప్రసవం తర్వాత కూడా దాదాపు ఆరు నెలల వరకు హార్మోన్ల ప్రభావం శరీరంపై ఇలాగే ఉంటుందని, ఆరు నెలల తర్వాత పరిస్థితి సాధారణమవుతుందటున్నారు నిపుణులు

కాబట్టి జుట్టు అధికంగా రాలుతోందని అనవసరంగా కంగారు పడకుండా ప్రసవం తర్వాత కూడా నిపుణుల సలహాతో సమతులాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి కొంతవరకైనా ఉపశమనం పొందచ్చు

రోజుకు 100 వెంట్రుకల వరకు ఊడిపోవడాన్ని నిపుణులు సాధారణంగానే పరిగణిస్తారు. అలా కాకుండా జుట్టు ఎక్కువగా, ముద్దలు ముద్దలుగా ఊడిపోతుంటే మాత్రం చర్మ వ్యాధి నిపుణుల్ని సంప్రదించాలి