వైద్యులు ముందుగా కళ్లనే ఎందుకు చెక్ చేస్తారు.? 

29 December 2023

తమ దగ్గరికి వచ్చిన రోగిని వైద్యులు ముందుగా కళ్లను చెక్‌ చేస్తారు. దీని ఆధారంగా రోగి ఆరోగ్యం విషయమై డాక్టర్‌ ఓ అంచనాకు వస్తారు. 

శరీరంలో రక్తం స్థాయిలు, బీపీ వంటి వాటిని కళ్లను చూసే వైద్యులు అంచనా వేస్తారు. అందుకే ముందుగా కళ్లను చెక్‌ చేస్తారు.

ఒకవేళ కళ్లు సాధరణం కంటే ఎక్కువగా ఎర్రగా ఉన్నాయంటే అది అధిక రక్తపోటు లేదా శరీరంలో ఇన్ ఫ్లేమేషన్‌ ఉందని అంచనా వేస్తారు.

అదే కళ్లు పచ్చగా కనపిస్తే కాలేయం లేదా పిత్తాశయ సమస్యలు ఉన్నట్లు అంచనాకు వస్తారు. దీని ఆధారంగా ఏవైనా పరీక్షలు అవసరం ఉంటే రిఫర్‌ చేస్తారు. 

ఒకవేళ కళ్లు పొడిబారినట్లు ఉన్నా దురదగా ఉన్నా వాతావరణంలో మార్పులు లేదా, స్క్రీన్ సమయం ఎక్కువగా గడుపుతున్నారని వైద్యులు అర్థం చేసుకుంటారు. 

కంటి కింది భాగంలో తెల్లగా పాలిపోయినట్లు ఉంటే రక్త హీనత సమస్య ఉన్నట్లు వైద్యులు అంచనాకు వస్తారు. అలాగే కళ్లు పచ్చగా ఉండే జాండిస్‌గా భావిస్తారు. 

విటమిన్‌ ఎ లోపం ఉంటే కళ్లలో తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. కళ్లు ఇలా మారితే విటమిన్‌ ఏ లోపం ఉందని వైద్యులు అంచనాకు వస్తారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.