ప్రపంచంలోని చాలా దేశాలు అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి. అయితే నేటికీ ప్రజలు ఒక పూట కూడా తినని దేశాలు చాలా ఉన్నాయి.
ఆఫ్రికా దేశం దక్షిణ సూడాన్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశం. ఇక్కడ 11 మిలియన్ల మంది అత్యంత పేదవారు. దక్షిణ సూడాన్ రాజధాని జుబా.
2011లో స్వాతంత్య్రం పొందిన ఈ దేశం అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. GDP ప్రకారం ఇక్కడి ప్రజల వార్షిక ఆదాయం 455.16 డాలర్లు అంటే 38,196 రూపాయలు మాత్రమే.
బురుండి ప్రపంచంలో రెండవ పేద దేశం. ఇక్కడి ప్రజలు నీరు, విద్యుత్ వంటి కనీస అవసరాల కోసం ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు.
ఇక్కడి ప్రజల వార్షిక ఆదాయం 915 డాలర్లు అంటే 76,786 రూపాయలు మాత్రమే అని చాల నివేదికలు వెల్లడిస్తున్నాయి.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ పేరు మూడవ స్థానంలో ఉంది. ఈ దేశ ప్రజలు సంవత్సరానికి 1120 డాలర్లు అంటే 93,996 రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ దేశ జనాభా మొత్తం 55 లక్షలు.
సోమాలియా ప్రపంచంలో నాల్గవ పేద దేశం. ఈ దేశంలో అస్థిరత, సైనిక దౌర్జన్యాలు, సముద్రపు దొంగల భీభత్సం ఉన్నాయి. ఈ దేశ జనాభా మొత్తం 1 కోటి 26 లక్షలు.
కాంగో ప్రపంచంలోని ఐదవ పేద దేశం. ఇక్కడి ప్రజలు ఏటా రూ.1,30,099 సంపాదిస్తున్నారు. ఇంకా మరికొన్ని పేద దేశాలు ఉన్నాయి.