భారతదేశ నయాగరా జలపాతం ఎక్కడ ఉందో తెలుసా..?

TV9 Telugu

29 May 2024

భారతదేశంలోని ఈ జలపాతాన్ని ప్రపంచంలోనే అతి పెద్దదైన నయాగ్రా జలపాతం పోల్చుతూ ఆ పేరుతో కూడా పిలుస్తారు.

ఇది సుమారు 100 అడుగుల ఎత్తు, 1000 అడుగుల వెడల్పుతో భారతదేశంలోనే అత్యంత విశాలమైన జలపాతంగా పేరు గాంచింది.

గుర్రపుడెక్క ఆకారం కారణంగా ఈ జలపాతాన్ని నయాగరా జలపాతంతో పోల్చారు. ఈ జలపాతం ఇంద్రావతి అనే నదిపై ఉంది.

ఇంద్రావతి నది తరువాత గోదావరిలో కలుస్తుంది. ఈ జలపాతంలో తరచు మొసళ్లు, పిల్లి చేపలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఈ జలపాతం అందాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఇక్కడి దృశ్యం వర్షాకాలంలో చూడదగ్గది.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని చిత్రకోట్ జలపాతాలు బస్తర్ జిల్లాలోని జగదల్‌పూర్‌కు పశ్చిమాన ఉంది ఈ జలపాతం.

ఒడిశాలోని కలహండి ప్రాంతంలో ఉద్భవించే ఇంద్రావతి నది 29 మీటర్ల ఎత్తు నుండి పడి ఈ జలపాతాన్ని ఏర్పరుస్తుంది.

చిత్రకోట్ ద్వారా సెకనుకు విడుదలయ్యే నీటి పరిమాణం దాదాపు 20 లక్షల లీటర్లు. నీటి పీడనం 500 ఏనుగుల బరువుతో సమానమని చెబుతారు.