యువత నిద్రకు ఉపక్రమించే ముందు ఏం ఆలోచిస్తుందన్న ఆలోచన వినడానికే ఆసక్తిగా ఉంటుంది కదూ. పరిశోధకులకు కూడా ఇదే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన ఓ సంస్థ 2000 మంది అడల్ట్స్‌పై ఓ సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
వీరిలో సుమారు 45 శాతం మంది నెక్ట్స్ డే తమ షెడ్యూల్ గురించి ఆలోచిస్తారని తేలింది. ఉదయం లేవగానే ఏం చేయాలనే ఆలోచనతో పడుకుంటారంటా.
ఇక 44 శాతం మంది యువత తమ జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తారంటా. పెళ్లి కానీ వాళ్లు తమకు కాబోయే వారి గురించి ఆలోచిస్తూ పడుకుంటారని తేలింది.
36 శాతం మంది తాము చేసే వృత్తికి సంబంధించిన అంశాల గురించి ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమిస్తారని సర్వేలో తేలింది.
27 నుంచి 42 ఏళ్ల వయసున్న వారు రోజంతా తాము గడిపిన ఇష్టమైన క్షణాలను ఆలోచిస్తూ పడుకుంటారని సర్వేలో వెల్లడైంది.
ఇక 43 నుంచి 58 ఏళ్ల వయసులో ఉన్న వారు తదుపరి రోజు గురించి పెద్దగా ఆలోచించరని తేలింది. 38 శాతం మంది మాత్రం తమ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారంటా.
24 ఏళ్ల లోపు వాళ్లలో 68 శాతం మంది స్మార్ట్ ఫోన్‌ను పక్కన పెట్టుకునే నిద్రపోతున్నారంటా. అలాగే 47 శాతం మంది డ్రస్ మార్చుకోకుండానే నిద్రపోతున్నారని తేలింది.