ఉప్పును మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదే అతిగా తీసుకుంటే మాత్రం విషంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉప్పు ప్రధాన కారణంగా.
ఉప్పును అధికంగా తీసుకుంటే బీపీ పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తుంటారు. దీర్ఘకాలంగా ఇలాగే కొనసాగితే.. గుండె సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉప్పు ఎక్కువైతే ప్రమాదం ఉన్నట్లే పూర్తిగా తక్కువైనా ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు తక్కువగా తీసుకుంటే ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారి తీస్తుంది. ఇది కండరాల తిమ్మిరి, బలహీనత, మైకం వంటి సమస్యలు వస్తాయి.
శరీరంలో సోడియం తగ్గితే.. హైపోనట్రేమియాకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇది తలనొప్పి, వికారం, అలసట, గందరగోళం, మూర్ఛ సమస్యకు దారి తీస్తుంది.
శరీరంలో సరిపడ ఉప్పు లేకపోతే శరీరంలో నీరు శాతం పెరుగుతుంది. ఈ కారణంగా శరీరంలో వాపు నిపిస్తుంది. కాళ్లు చేతుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
సోడియం తగ్గితే.. కాల్షియం ఫ్రాగ్మెంటేషన్ లేదా విచ్ఛిత్తిని తగ్గిస్తుంది, దీని కారణంగా ఎముకల సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలను పెంచుతుంది.
ఉప్పు తీసుకోవడం పూర్తిగా మానేస్తే శరీరంలో థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఉప్పును కచ్చితంగా పరిమితంగా తీసుకోవాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.