ఆడవాళ్లు ఏ ఏజ్‌లో పెళ్లి చేసుకోవాలో తెలు
సా.?
04 September 2023
ఒకప్పుడు 18 ఏళ్లు దాటితే చాలు ఆడ పిల్లలకు వివాహం చేసేయాలన్న ఆలోచనలో ఉండేవారు పెద్దలు. వివాహం చేస్తే బాధ్యత తీరుతుందని భావించే వారు.
కానీ ప్రస్తుతం కాలం మారింది. మహిళలు కూడా పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు.
దీంతో మహిళల వివాహ సమయం పెరిగింది. 30 ఏళ్లు దాటినా కెరీర్ అంటున్నారు తప్ప వివాహానికి మొగ్గు చూపడం లేదు.
అయితే 30 ఏళ్ల తర్వాత వివాహం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 30 తర్వాత తల్లి అయ్యే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు.
కొన్ని రకాల అంశాలను తీసుకున్న తర్వాత 28 నుంచి 32 ఏళ్ల మధ్య వయసు వివాహానికి సరైన సమయమని సూచిస్తున్నారు.
ఈ వయసు నాటికి అటు వృత్తిపరంగా స్థిరపడడమే కాకుండా ఆలోచన విధానాల్లో మెచ్యురిటీ వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
30 నుంచి 35 ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీ వస్తే బీపీ, షుగర్ వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయని ఇది పుట్టబోయే బిడ్డపై కూడా ప్రభావం చూపుతుందని
హెచ్చరిస్తున్నారు.
ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల అది కచ్చితంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. బిడ్డకు జన్మనిచ్చే తల్లికి కూడా ప్రమాదకరమని
చెబుతున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..