అమెరికా జాతీయ పక్షి బాల్డ్ ఈగిల్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

TV9 Telugu

30 December 2024

బాల్డ్ ఈగిల్‌ను అమెరికా జాతీయ పక్షిగా పరిగణించే బిల్లుపై ప్రెసిడెంట్ జో బిడెన్ ఆమోదించి సంతకం చేశారు.

240 సంవత్సరాలకు పైగా, బాల్డ్ ఈగిల్ అమెరికా జాతీయ పక్షిగా పరిగణిస్తారు. ఇంతకు ముందు ఈ పక్షి జాతీయ చిహ్నంగా భావించేవారు.

బాల్డ్ ఈగిల్ గురించి కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం. అవి ఏమి తింటాయి, రోజులో ఎంత ఆహారం తింటాయి తెలుసుకుందాం.

బాల్డ్ ఈగల్స్ ఆహారంలో 70 నుండి 90 శాతం చేపలు ఉంటాయి. తరచుగా బాతులు, హంసలను వేటాడతాయి. అలాగే, వేటగాళ్లచే గాయపడిన పక్షులను తింటారు.

ఈ గద్దలు మంచి వేటగాళ్లుగా మారకపోతే అవి మాంసం, చనిపోయిన జంతువులను తింటాయి. క్రమంగా వేట నేర్చుకుని అందులో ప్రావీణ్యం సంపాదించుకుంటారు.

బాల్డ్ ఈగల్స్ 3 అడుగుల పొడవు, 9 పౌండ్ల బరువు ఉంటాయి. వాటి రెక్కలు 5.5 నుండి 7.5 అడుగుల వరకు ఉంటాయి. ఇవి గంటకు 70 మైళ్ల వేగంతో ఎగురుతాయి.

వాటి చూపు చాలా పదునైనది. వాటి గూడు పరిమాణం 8-10 అడుగులు. ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద గూడు 20 అడుగుల లోతు, 13 అడుగుల వెడల్పు, 3 టన్నుల బరువు ఉంటుంది.

బాల్డ్ ఈగల్ ఉత్తర అమెరికాలోని అతిపెద్ద పక్షులలో ఒకటి. ఎప్పుడూ నదులు, చిత్తడి నేలలు, సరస్సులు లేదా తీరాలలో నివసిస్తుంది.

బాల్డ్ ఈగల్ తలపై తెల్లటి ఈకలు కలిగి ఉంటుంది. అలాగే శరీరంపై దాదాపు 7,000 ముదురు గోధుమ రంగు ఈకలు ఉంటాయి.