నయాగరా జలపాతం గూర్చి ఈ విషయాలు తెలుసా?

TV9 Telugu

17 March 2024

అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఉండే నయాగరా వాటర్ ఫాల్స్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. నయాగరా జలపాతం వయస్సు కేవలం 12,000 సంవత్సరాలు మాత్రమే.

భూమిపై ఉన్న ఇతర స్వరూపాలతో పోల్చితే నయాగరా జలపాతం చాలా చిన్నది.  దీన్ని చూడటానికి నుంచి నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు.

నయాగరా వాటర్‌ ఫాల్స్‌ను హనీమూన్‌ క్యాపిటల్ ఆఫ్‌ ది వరల్డ్‌ అని అంటారు. ఈ జలపాతానికి ప్రతి ఏడాది 12 మిలియన్ల మంది సందర్శిస్తుంటారు.

నయాగరా వాటర్‌ఫాల్స్‌ అనేవి మూడు వాటర్‌ఫాల్స్‌ కలయిక. ఇందులో అమెరికన్‌ వాటర్ ఫాల్స్‌, బ్రైడల్‌ వీల్‌ ఫాల్స్‌, కెనడియన్ ఫాల్స్‌ ఉన్నాయి.

నయాగరా జలపాతం నుంచి ప్రతి సెకనుకు దాదాపు 28 మిలియన్‌ లీటర్లు అంటే ఏడు లక్షల గ్యాలన్ల నీరు ప్రవహిస్తుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా కదిలే జలపాతం ఇదే.

ఇక్కడ 1881లో మొట్టమొదటి జల విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. దీని ద్వారా 4.9 మిలియన్ కిలోవాట్ల శక్తి ఉత్పత్తి అవుతుంది.

అమెరికాలో నివస్తున్న ప్రజల్లో 20 శాతం మందికి తాగే నీటిని నయాగరా జలపాతమే అందిస్తుంది. భూమిపై ఉన్న మంచినీటిలో 21 శాతం ఈ జలపాతం వద్దే ఉంది.

నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్‌ను 1885వ సంవత్సరంలో ప్రారంభించారు. ఇది అమెరికాలో ఉన్న అత్యంత పురాతన పార్క్‌.

నయాగరా వాటర్‌ఫాల్స్‌ దగ్గర 400 ఎకరాల్లో జంతుజాలం మనుగడ సాగిస్తోంది. స్థానికంగా వింటర్‌ గిల్స్‌, బాతులు ఇక్కడే కనిపిస్తాయి.