మోదుగ పువ్వు ఉపయోగాలేంటో తెలుసా?

Jyothi Gadda

02 August 2024

నారింజరంగుతో, ఎర్రని గుత్తుల ఈ పూలు కనువిందుచేస్తాయి. చాలా తమాషాగా వుంటాయి. కొక్కేలలాగా, కొద్దిగా చిలుకముక్కుల్లాగా వుంటాయి పూలు. ఆకులేకనిపించనట్లు నిండుగాపూస్తాయి.

ఈ పూల పుప్పొడి నుండి అబిర్ అనే హోలి రంగును తయారుచేస్తారు. పూలమొగ్గలు ముదురు బ్రౌన్ రంగులో వుండి, చెట్టు పైన పూలు బాగా పూసి ఎర్రగా అగ్నిశిఖలాగా కనిపిస్తాయి. 

మోదుగ పూలను అగ్నిపూలు అని కూడా పిలుస్తారు. కాయలను వైద్యంలో వాడుతారు. ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మోదుగ నూనె, ఆకులు, విత్తనాలు కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

మోదుగను ఆయుర్వేదంలో అనేక ఔషధాలుగా ఉపయోగిస్తారు. మోదుగ విత్తనాల్ని పొడి చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే కడుపులో క్రిములు నాశనమవుతాయి. 

మోదుగ చెట్టులోని ప్రతి భాగాన్ని పూజల్లో ఉపయోగిస్తుంటారు. ఇంటిలో చెడుదృష్టిని పోగొట్టడానికి ఎండిన మోదుగు కట్టేలను కాలుస్తారు. వాటితో వచ్చే పొగ  చెడును హరిస్తుందని నమ్ముతారు.

మోదుగపూలు ఒక రకమైన సువాసతో, అందంగా వుంటాయి. నిండు ఆరంజి రంగులోని ఈ పూలను చూస్తే మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ పువ్వులు పరమశివుడికి అత్యంత ఇష్టం. 

ఈ చెట్టు బంక టానింగ్, రంగుల అద్దకంలోనూ వాడుతారు. కాండం బెరడును పరిశ్రమలలో ఉపయోగిస్తారు. బెరడునుండి నార తీస్తారు. చూశారా చెట్టు త్యాగం సర్వం మానవ ఉపయోగార్ధమే.

లక్క పురుగులు దీనికి అతిథులు. ఈ మోదుగ చెట్టు కలపను ప్యాకింగ్ పెట్టెలతయారీకి వాడుతారు. తుపాకిమందుకు ఈ కర్ర బొగ్గు ఉపయోగపడుతుంది.