మెట్రో రైల్ పైకప్పుపై కూర్చొంటే జరిమానా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

TV9 Telugu

27 May 2024

దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా ముంబై, బెంగుళూరు, చెన్నై వంటి చాల మహా నగరాల్లో మెట్రో రైళ్లు మణిహారంగా మారాయి.

ఎలక్ట్రిసిటీతో కాలుష్య రహిత ప్రయాణ సేవలు అందిస్తూ ప్రజాదరణ పొందిన రవాణా వ్యవస్థగా నిలుస్తున్నాయి మెట్రో రైళ్లు.

మెట్రోకు పెరుగుతున్న ఆదరణ, ప్రజావసరాల దృష్ట్యా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మెట్రో రైల్ సేవలు విస్తరిస్తున్నాయి.

అయితే మెట్రోలో ప్రయాణించడానికి చాలా నియమాలు ఉన్నాయి. ఈ నిబంధనలలో రైలులో కూర్చోవడానికి కూడా నియమాలు ఉన్నాయి.

ఇలా లోపల ఉన్న సీటుపై కూర్చొని మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆలా కాకుండా మెట్రో పైకప్పుపై కూర్చోవడం నేరం.

మెట్రో రైల్ పైకప్పు మీద కూర్చోవడం చాలా ప్రమాదకరం. ఇలా ప్రయాణించిన వారికి భారీగా జరిమానాలు విధిస్తారు.

మెట్రో రైలు పైకప్పు మీద కూర్చొని ప్రయాణం చేస్తే, ఎంత జరిమానా విధిస్తారో తెలిస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది.

సెక్షన్ 63 ప్రకారం, ప్రయాణీకుడి నుండి కేవలం రూ.50 జరిమానా లేదా ఒక నెల వరకు జైలు శిక్ష లేదా రెండూ వసూలు చేయడం జరుగుతుంది.