ఇండియా గేట్ పూర్తి పేరు ఏంటో తెలుసా ?

TV9 Telugu 

07 October 2024

ఇండియా గేట్ దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ప్రధాన చారిత్రక స్మారక చిహ్నం. దీన్ని చూసేందుకు ఏటా చాలామంది వెళ్తారు.

ఇది భారత స్వాతంత్ర్య పోరాటం, మొదటి ప్రపంచ యుద్ధంలో అమరవీరుల జ్ఞాపకార్థంగా ఢిల్లీలో నిర్మించడం జరిగింది.

ఇండియా గేట్ అనేది 42 మీటర్ల ఎత్తు ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ స్మారక చిహ్నంగా పేరు పొందడం విశేషం.

ఈ స్మారక చిహ్నం 1914 - 1921 మధ్య తమ ప్రాణాలను త్యాగం చేసిన 74,187 మంది భారతీయ సైనికుల జ్ఞాపకార్థం నిర్మించారు.

ఇండియా గేట్ నిర్మాణం 1921లో ప్రారంభమై 1931 నాటికి పూర్తయింది. సర్ ఎడ్విన్ లుటియన్స్ దీనిని రూపొందించారు.

1931 ఫిబ్రవరి 12న వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ చేత ఈ చారిత్రక యుద్ధ స్మారక చిహ్నం ప్రారంభించడం జరిగింది.

ఇండియా గేట్ స్మారక చిహ్నంపై 13,313 మంది సైనికుల పేర్లు చెక్కబడి ఉన్నాయి. వారిలో 12,357 మంది భారతీయులు.

ఇండియా గేట్ పూర్తి పేరు ఏటంటే..చాలామందికి తెలీదు. దీని పూర్తి పేరు ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని చెప్పబడింది.