వంటల్లో మనం ఎన్నో రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తాం. ఇవి ఫుడ్ మంచి టేస్టీగా చేస్తాయి. ఇళాంటి మసాలా దినుసుల్లో జాపత్రి ఒకటి. ఇది చూడటానికి ఒక పువ్వులా కనిపిస్తుంది.
TV9 Telugu
ఈ జాపత్రి ఆహారానికి మంచి సువాసన, రుచిని ఇవ్వడమే కాకుండా.. ఆడవారి ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జాపత్రి ఆడవారిలో ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది.
TV9 Telugu
జాపత్రి ఆడవాళ్ల చర్మానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ముఖంపై మచ్చలను, బ్లాక్ హెడ్స్ ను తొందరగా తగ్గించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
TV9 Telugu
ఆడవారు ఈ జాపత్రిని ఉపయోగించి కీళ్ల నొప్పుల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబతున్నారు. మీ ఆహారంలో జాపత్రిని చేర్చుకుంటే కీళ్ల నొప్పులు, వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.
TV9 Telugu
2 గ్రాముల జాపత్రిలో కొద్దిగా ఎండు అల్లాన్ని వేసి వేడి నీళ్లలో కలుపుకుని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆడవాళ్లకు కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
TV9 Telugu
జాపత్రిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అజీర్ణం, అతిసారం,మలబద్ధకం, కడుపు నొప్పి వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
TV9 Telugu
అధిక ఒత్తిడికి గురయ్యే ఆడవారికి జాపత్రి ఎంతో మేలు చేస్తుంది. ఈ మసాలానుు తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే, ప్రశాంతంగా ఉంటారు.
TV9 Telugu
ఆకలి తక్కువగా ఉంటే, శరీరంలో బలహీనంగా అనిపించినా కూడా ఆహారంలో జాపత్రిని చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది మీ ఆకలిని పెంచడానికి బాగా సహాయపడుతుంది.