ప్రపంచంలో అతిపెద్ద కీటకం ఏదో తెలుసా..?

TV9 Telugu

24 October 2024

ఈ భూమిపై అనేక రకాల జీవరాశులు నివసిస్తున్నాయి. కోట్ల సంవత్సరాల క్రితం కొన్ని అంతరించి పోయాయి. వాటిని ఇప్పుడు వెలికి తీస్తున్నారు.

ప్రపవ్యాప్తంగా అనేక రహస్యాలు ఎన్నో బహిర్గతమవుతున్నాయి. శాస్త్రవేత్తలు అలాంటి రహస్యాలను ఆవిష్కరిస్తున్నారు.

ఈసారి శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద కీటకాన్ని కనుగొన్నారు.అదేంటో.? ఎక్కడ ఉందొ.? ఈరోజు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అతిపెద్ద కీటకం 9 అడుగుల పొడవు ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలాగే 50 కిలోల బరువు ఉంటుంది.

అయితే, అది ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఎందుకంటే దీని శిలాజాల దొరికిన, తల మాత్రం దొరకలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ కీటకాల చిత్రాన్ని సిద్ధం చేశారు. ఈ పరిశోధన ఇటీవల సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు.

ఈ కీటకం తల బల్బ్ ఆకారాన్ని పోలి ఉంటుంది. దీనికి పీతల వంటి కళ్ళు ఉన్నాయి. ఇది పీతలు, సాలెపురుగులు, ఇతర కీటకాల సమూహంలో చేర్చారు.

పరిశోధన చేసిన ఫ్రాన్స్‌లోని విల్లెర్‌బాన్‌లోని యూనివర్సిటీ క్లాడ్ బెర్నార్డ్ లియోన్‌కు చెందిన పాలియోంటాలజిస్ట్ మిచెల్ ప్రకారం, ఇది సముద్రపు తేలు పరిమాణంలో ఉండేదంటున్నారు.