TV9 Telugu

బియ్యం నీటితో చర్మం నిజంగానే మెరుస్తుందా..!

14 Febraury 2024

బియ్యం కడిగిన నీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి వివిధ ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

అతిసారం, వికారం, కడుపు జబ్బుల వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు బియ్యం నీరు సహాయపడుతుంది

చర్మ సంరక్షణలో బియ్యం నీటిని ఉపయోగిస్తారు.  ఇది చర్మం చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

రైస్ వాటర్‌ను ఫేషియల్ క్లెన్సర్‌గా, టోనర్‌గా ఉపయోగించవచ్చు. ఇది పొడిబారిన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.  

రైస్ వాటర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మం చికాకు, దురద, చర్మశోథ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బియ్యం కడిగిన నీళ్లతో ముఖం కడుక్కుంటే ముఖంపై ఉన్న ముడతలన్నీ మాయమవుతాయి. 

శుభ్రమైన కాటన్ గుడ్డను బియ్యం నీళ్లలో ముంచి ముఖంపై కొద్దిసేపు రుద్దితే చర్మ రంధ్రాలు బిగుతుగా మారుతుంది.

 బియ్యం నీటిని చర్మానికి పట్టిస్తే కణాలు పునరుజ్జీవింపబడతాయి. చర్మకాంతిని పెంచుతాయి. మొటిమలు చర్మ మంటలను తొలగిస్తుంది.