పొన్నగంటి కూర పోషకాల పుట్ట..ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Jyothi Gadda

30 November 2024

TV9 Telugu

ఆకు కూరలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. ఆకు కూరల్లో పొన్నగంటి కూరది ప్రత్యకమైన స్థానం. ఒక్కమాటలో చెప్పాలంటే పొన్నగంటి కూర పోషకాల పుట్ట అంటారు నిపుణులు.

TV9 Telugu

పొన్నగంటి కూర తీసుకోవడం వల్ల దీర్ఘకాల సమస్యలు దూరం అవుతాయి. దీని వల్ల మనం రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఈ ఆకులతో కూర చేసి తినడం వల్ల బరువు తగ్గుతారు.

TV9 Telugu

పొన్నగంటి ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికం. పొన్నగంటి కూరను తరచూ తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపస్తుంది.

TV9 Telugu

మగవారిలో వీర్యకణాల్లోని లోపాలను సరిదిద్దుతుంది. నరాల్లో నొప్పికి, వెన్నునొప్పికి పొన్నగంటి ఆకు దివ్వౌషధంగా పనిచేస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి ఈ ఆకు ఎంతో మేలు చేస్తుంది. 

TV9 Telugu

పొన్నగంటిఆకును తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుంది. ఒక టేబుల్ స్పూన్ తాజా ఆకుల రసంలో వెల్లుల్లి కలిపి తీసుకంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా తగ్గుతాయి.

TV9 Telugu

క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చక్కగా తోడ్పడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

TV9 Telugu

పొన్నగంటి ఆకుల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు, టాన్సిలిటిస్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

TV9 Telugu

పొన్నగంటి ఆకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ వ్యాధిని నివారించడంలో కూడా సహాయపడుతుంది. 

TV9 Telugu

పొన్నగంటి కూరలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఇది రాత్రి కురుపు వంటి కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

TV9 Telugu