ఏసీ నుంచి వచ్చిన నీటిని ఈ పనులకు వాడవచ్చని తెలుసా.?
TV9 Telugu
19 October 2024
ఏసీ రన్ చేసిన తర్వాత అందులో నుంచి నీరు వస్తుంది, దీన్ని చాలా మంది వృధా చేస్తారు, అయితే ఈ నీరు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో తెలుసా..?
ఏసీ నుంచి వచ్చే నీటిని వృథా చేయకండి అంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఈ స్పెషల్ టిప్స్ ఇచ్చారు.
వేసవిలో దేశంలోని అనేక నగరాల్లో ఇది చాలా వేడిగా ఉంది. ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఏసీ వాడుతూ ప్రశాంత పొందుతున్నారు.
ఆనంద్ మహీంద్రా కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా X ప్లాట్‌ఫారమ్‌లో AC నీటిని ఆదా చేయడానికి ఒక ఉపాయాన్ని పంచుకున్నారు.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, ఏసీ నుండి వచ్చే నీరు మందపాటి పైపులో నిల్వ చేయాలని చెప్పారు.
దానికి అమర్చిన ఈ పైపు దిగువన ఒక ట్యాప్ ఏర్పాటు చేయాలి. వినియోగదారులు తమకు కావలసినప్పుడు ఆ నీటిని ఉపయోగించవచ్చు.
ఏసీ నుంచి వచ్చే నీటిని చాలా చోట్ల వాడుకోవచ్చు. ఈ నీటిని ఇల్లు శుభ్రం చేయడానికి, బట్టలు ఉతకడానికి మొదలైన వాటికి ఉపయోగించవచ్చు.
ఏసీ నుంచి వచ్చే ఈ నీటిని మొక్కలకు వేయాలా వద్దా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఖనిజాలు లేనందున ఈ నీరు తాగడానికి పనికిరాదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి