OYOకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
TV9 Telugu
23 August 2024
ప్రపంచంలోనే అతిపెద్ద బడ్జెట్ హోటల్ బ్రాండ్‌గా OYOకి పేరుంది. తక్కువ ఖర్చుతో అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.
అయితే OYO పూర్తి పేరు చాలామందికి తెలీదు. ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.. దీని పూర్తి పేరు ఆన్ యువర్ ఓన్.
OYO పూర్తి పేరు అంటే మీ హోటల్ గది మీ స్వంత స్థలం. ఈ పేరు పెట్టడానికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ చెప్పారు.
రితేష్ అగర్వాల్ తన చిన్నతనంలో చదువుల కోసం ఎప్పుడూ బంధువుల ఇంట్లో ఉండేవాడని ఒక పాత ఇంటర్వ్యూలో చెప్పాడు.
రితేష్ ఆగర్వాల్ తొలిసారి తన పనిని ప్రారంభించినప్పుడు, అతను ఆన్ యువర్ ఓన్ అనే భావనను అర్థం చేసుకున్నాడు.
OYO IPO ఈ సంవత్సరం వస్తుండి. ఈ ఐపీఓ నుంచి కంపెనీ రూ.8,430 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ.7,000 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయనున్నారు.
2013లో ప్రారంభమైన OYO హోటల్, బోర్డింగ్ రంగంలో దూసుకుపోతోంది. 2023-24లో మొదటి త్రైమాసికానికి గానూ రూ.229 కోట్ల లాభాలను ఆర్జించింది.
OYO బ్రాండ్ పేరుతో హోటళ్లు ప్రపంచంలోని 800 కంటే ఎక్కువ నగరాల్లో కనిపిస్తాయి. వీటికి ప్రజల్లో మంచి డిమాండ్ ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి