దేశంలో ఎన్ని రకాల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయో తెలుసా..?
TV9 Telugu
07 October 2024
భారత ప్రభుత్వం వివిధ రకాల పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తుంది. ఒక్కొక్కటి ఒక్కో రంగు, ఒక్కో వినియోగంతో ఉంటాయి.
వ్యక్తిగత ప్రయాణానికి, అధికారిక విధికి, విదేశాల్లో పనిచేసే ఉద్యోగులకు వివిధ రకాల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి.
బ్లూ పర్సనల్ పాస్‌పోర్ట్ - టూరిజం, బిజినెస్, విదేశాల్లో చదువుకోవడానికి 10 సంవత్సరాల పాటు ఈ పాస్‌పోర్ట్ ఇస్తారు.
వైట్ సర్వీస్ పాస్‌పోర్ట్ - ఈ ప్రత్యేక తెలుపు పాస్‌పోర్ట్ విదేశాల్లో ప్రభుత్వ పని కోసం ప్రభుత్వ అధికారులకు జారీ చేయడం జరుగుతుంది.
ఆరెంజ్ ఇమ్మిగ్రేషన్ పాస్‌పోర్ట్ - ఈ పాస్‌పోర్ట్ ఉద్యోగం, చట్టపరమైన పని, విదేశాలలో నివాసం కోసం జారీ చేస్తారు.
మెరూన్ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ - భారతీయ దౌత్య అధికారులు, ఉన్నత అధికారులు, అంతర్జాతీయ మిషన్ల కోసం వినియోగిస్తారు.
ఆన్‌లైన్ లేదా ఇ-పాస్‌పోర్ట్ - వ్యక్తిగత, అధికారిక ఉపయోగం కోసం బయోమెట్రిక్ చిప్‌తో కూడిన ఆధునిక పాస్‌పోర్ట్.
మీరు పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానం పాస్‌పోర్ట్ రకం, దరఖాస్తుదారుడి అవసరాన్ని బట్టి ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి